MNCL: లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని వివిధ మండలాల్లో మళ్లీ చలి తీవ్రత పెరగడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఆదివారం లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. గత సంవత్సరం కంటే నాలుగు డిగ్రీలు తక్కువగా ఉందని అధికారులు తెలిపారు. చాలా గ్రామాలలో పొగమంచు దట్టంగా కమ్ముకుంది. బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు.