ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలలో ఈనెల 4న జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్ జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. అండర్- 8,10,12,14, 20 విభాగాల్లో పాల్గొనే బాలబాలికలు రేపు ఉదయం 9 గంటలకు క్రీడా పాఠశాలలో బోనఫైడ్, ఆధార్ కార్డుతో కోచ్‌కు రిపోర్టు చేయాలన్నారు.