KMR: జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కు కామారెడ్డి జిల్లా ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ జేఏసీ అధ్యక్షుడు మహ్మద్ అల్లాఉద్దీన్ ఆధ్వర్యంలో వారి బృందంతో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అనంతరం కలెక్టర్కు పూల బొకేతో నోటుబుక్కులు ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు అరుణ్ కుమార్, కోశాధికారి రాజేందర్ ఉన్నారు.