TG: కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు బీఆర్ఎస్ రూ.90 వేల కోట్లు ఖర్చు చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ గుర్తు చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కోసం రూ.27 వేల కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ.7 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. తాము అధికారంలోకి వచ్చేనాటికి రూ.10 వేల కోట్ల ఇరిగేషన్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు.