SKLM: కార్గో ఎయిర్పోర్ట్కు భూములు ఇవ్వమంటుంటే ప్రభుత్వాధికారులు సర్వేలకు సహకరించమని ప్రకటన చేయడం విడ్డూరంగా ఉందని కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తపరిచారు. సోమవారం మందస మండలం ఎంగంగువాడ గ్రామంలో బాధిత రైతులతో సమావేశం నిర్వహించారు. మా భూములు మేము ఇవ్వమంటూ రైతులు ఆందోళన చేశారు.