AP: వైసీపీ హయాంలో ప్రజలపై విద్యుత్ భారం ఉండేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. తాము రికార్డుస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. అందుకే తమ ప్రభుత్వం 24 గంటల విద్యుత్‌ను ఇవ్వగలుగుతుందని వెల్లడించారు. ప్రైవేటీకరణ అనే ఆలోచనే లేదని స్పష్టం చేశారు.