ప్రకాశం: బేస్తవారిపేట మండలంలో బుధవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ అధికారి ఎస్.ఎస్. రావు మంగళవారం తెలిపారు. లైన్ల మరమ్మత్తుల పనుల కారణంగా మండలంలోని పూసలపాడు, పందిళ్లపల్లి, మోక్షగుండం గ్రామాలలో రేపు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ అంతరాయానికి ప్రజలు సహకరించాలని కోరారు.