ASR: పెదబయలు(M) తురకలవలస GTWA బాలికల పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న వంతాల నందిని (13) అనారోగ్యంతో మంగళవారం మృతి చెందింది. కిముడుపల్లి పంచాయతీ మచ్చేపల్లి గ్రామానికి చెందిన నందినికి ఈనెల 3 నుంచి ఆరోగ్యం క్షీణించడంతో పాడేరు జిల్లా ఆస్పత్రికి, అక్కడి నుంచి KGHకు రిఫర్ చేశారు. బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.