ELR: సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకంతో సామాన్య ప్రజలకు ఎంతో లాభం చేకూరుతుందని ఏపీ ఆప్కాబ్ ఛైర్మన్ వీరాంజనేయులు తెలిపారు. ఇవాళ భీమడోలు జంక్షన్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుతో విద్యుత్ బిల్లుల భారం తగ్గడమే కాకుండా.. మిగిలిన విద్యుత్తును విక్రయించి అదనపు ఆదాయం పొందవచ్చని వివరించారు.