ప్రకాశం: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కనిగిరి వైసీపీ ఇన్ఛార్జి డాక్టర్. దద్దాల నారాయణ యాదవ్ ఆయన క్యాంపు కార్యాలయంలో మంగళవారం తోపుడు బండ్లను పేదలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తోపుడు బండ్లు అద్దెకు తీసుకొని జీవనం సాగిస్తున్న వారికి తన సొంత నిధులనుంచి 20 మందికి తోపుడు బండ్లు తీసి ఇచ్చినట్లు ఆయన తెలిపారు.