KMM: జిల్లాలో యూరియా స్టాక్‌పై దుష్ప్రచారాలను రైతులు నమ్మవద్దని, జిల్లాలో యాసంగి సాగుకు అవసరమైన మేర స్టాక్ పుష్కలంగా అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. రైతులకు సకాలంలో యూరియా పంపిణీ చేసేందుకు అన్ని మండలాల్లో సమగ్ర చర్యలు చేపట్టామని చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో 11,817 మెట్రిక్ టన్నుల యూరియా స్టాక్ అందుబాటులో ఉందని పేర్కొన్నారు.