ADB: గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలక పాత్ర పోషించాలని MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. బోథ్ మండలంలోని కనుగుట్ట గ్రామ సర్పంచ్ ఆకుల ఆనిత మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలోని సమస్యలు, పలు అంశాలను ఎమ్మెల్యేకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు, తదితరులు, పాల్గొన్నారు.