VSP: 2024 ఎన్నికల హామీ మేరకు చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు తగ్గించారని విశాఖ టీడీపీ అధ్యక్షుడు చోడే పట్టాభి రామ్ తెలిపారు. సోమవారం విశాఖ టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ట్రూ డౌన్ అమలు చేసి యూనిట్‌కు 13 పైసలు తగ్గిస్తూ రూ.4,500 కోట్లు ప్రభుత్వం భరిస్తోందన్నారు. వైసీపీ హయాంలో రూ.32 వేల కోట్ల భారం వేసి విద్యుత్ రంగాన్ని అప్పుల్లో ముంచారని విమర్శించారు.