MBNR: మహమ్మదాబాద్ మండలం నంచర్ల గ్రామంలో వడ్డే నర్సింలు ఇంట్లో దీపం కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు బయట ఉన్న సమయంలో గోడ పగుళ్ల నుంచి పొగలు రావడాన్ని గమనించిన గ్రామస్తులు అప్రమత్తమయ్యారు. వెంటనే పంచాయతీ సిబ్బంది సహకారంతో మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. సమయానికి స్పందించడంతో ఇంటికి స్వల్ప నష్టం మాత్రమే జరిగింది.