VZM: ఏపీ ఉత్తర్వుల సంఖ్య 319 ప్రకారం జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారుల రుణాలకు వడ్డీ మాపీ చేయడం జరుగుతుందని ఆ శాఖ ఈడీ వెంకటేశ్వరరావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్ఎస్ఎఫ్ డీసీ పథకం ద్వారా రుణాలు పొందిన 297 మందికి సంబంధించి రూ.96.60 లక్షల వడ్డీ మాఫీ చేయడం జరుగుతుందని, అలాగే ఎన్ఎస్కేఎఫ్ డీసీ పొందిన 173 మందికి రూ 47.18 లక్షలు వడ్డీ మాఫీ అవుతుందన్నారు.