SRPT: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రజలు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ నరసింహ ఇవాళ సూచించారు. నగదు, నగలు లాకర్లలో భద్రపరుచుకోవాలని సూచించారు. అలాగే ఊరేళ్తున్నట్లు సోషల్ మీడియాలో పెట్టవద్దని కోరారు. జిల్లా వ్యాప్తంగా 24 గంటల పెట్రోలింగ్ ఏర్పాటు చేశామని, ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే డయల్ 100 లేదా కంట్రోల్ రూమ్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు.