MDK: రామాయంపేట మండలం అక్కన్నపేట వద్ద మెదక్ ఎల్కతుర్తి జాతీయ రహదారిపై రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అక్కన్నపేట వద్ద బైపాస్ రోడ్డు నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో రింగ్ రోడ్ ఏర్పాటు చేసి గ్రామంలోకి బస్సులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని తహసిల్దార్ రజనీ కుమారికి వినతి పత్రం సమర్పించారు.