ఢిల్లీ లక్ష్మి నగర్లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. వ్యాపారంలో వచ్చి విభేదాల కారణంగా జిమ్ యాజమాని కుటుంబంపై కొందరు దుండగులు దాడి చేశారు. భర్తను కొట్టి అనంతరం భార్యను వేధించారు. అంతటితో ఆగకుండా వారి కుమారుడిని వీధిలోకి తీసుకెళ్లి నగ్నంగా మార్చి దాడి చేశారు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.