MBNR: రాబోయే కార్పొరేషన్ ఎన్నికలలో మహబూబ్ నగర్లో 60 స్థానాలను గెలుచుకుందామని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కష్టపడి పని చేసి ఫలితం ఆశించకుండా ఉంటేనే కార్యకర్తలకు నాయకులకు సరైన గుర్తింపు లభిస్తుందని అన్నారు.