TG: హిల్ట్ పాలసీలో పారదర్శకత కనిపించడం లేదని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ అన్నారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా మాట్లాడిన అక్బరుద్ధీన్.. మౌలిక సదుపాయాలు, కనీస వసతులపై స్పష్టత లేదన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం భూముల చుట్టే తిరుగుతుందన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోల్లో తప్పులుంటే చర్యలు తీసుకోవాలని సూచించారు.