NZB: ఇటీవల రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్లో నిర్వహించిన అండర్-19 హాకీ టోర్నమెంట్లో జిన్నా మను శ్రీ తేజ్ ఉత్తమ ప్రతిభ కనబరిచిన జాతీయస్థాయికి ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా కళశాల సిబ్బంది అతన్ని అభినందించారు. శ్రీ తేజ్ ప్రస్తుతం కాకతీయ జూనియర్ కళాశాలలో రెండవ సంవత్సరం చదువుతున్నాడు. కాగా జాతీయ స్థాయి క్రీడలు రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్ పూర్లో జరగనున్నాయి.