SRPT: హైదరాబాద్లో ఈనెల 25 నుండి 28 వరకు నిర్వహించే ఐద్వా 14వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలో మహాసభల నిధిని సేకరించారు. మహిళల హక్కులు, రక్షణ కోసం ఐద్వా నిరంతరం పోరాడుతోందన్నారు. 25న జరిగే బహిరంగ సభకు మహిళలు తరలిరావాలని, మనువాదాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.