SRCL: చిల్డ్రన్ హోం భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఇంఛార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. తంగళ్ళపల్లి మండలం మండేపల్లి పరిధిలో టీజీఈడబ్ల్యూఐడీసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న చిల్డ్రన్ హోం నిర్మాణ పనులను ఇంఛార్జి కలెక్టర్ ఇవాళ పరిశీలించారు. భవన నిర్మాణ ప్లాన్, పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పనుల్లో వేగం పెంచాలని తెలిపారు.