AP: కడప డీఆర్సీ సమావేశంలో వాడీవేడి చర్చ జరిగింది. రాయలసీమ ఎత్తిపోతలపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. రాయలసీమ ఎత్తిపోతలను ఎలా చేపడుతున్నారని ఎంపీ అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. దానికి బదులుగా వైసీపీ హయాంలో లిప్ట్ ఇరిగేషన్ ఏం చేశారని మంత్రి సవిత ప్రశ్నించారు. దీంతో సమావేశం మధ్యలోనే అవినాష్ రెడ్డితో పాటు వైసీపీ నేతలు బయటకు వచ్చారు.