MDK: నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో ఆశ వర్కర్ పుష్పలత సీజనల్ వ్యాధులపై ఇంటింటి సర్వే నిర్వహించారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం, ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు గ్రామంలోని ప్రజలను న్యుమోనియా, జలుబు, జ్వరం వంటి లక్షణాల పట్ల సర్వే చేయడం జరుగుతోంది. శీతాకాలంలో చలి తీవ్రంగా ఉంటందున, ప్రజలు అనేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు.