తమిళనాట మరోసారి సెన్సార్ వివాదం రాజుకుంది. హిందీ వ్యతిరేక ఉద్యమ నేపథ్యంలో తెరకెక్కిన ‘పరాశక్తి’ చిత్రానికి ఇంకా సెన్సార్ క్లియరెన్స్ రాలేదు. కేంద్రానికి వ్యతిరేక సన్నివేశాలున్నాయన్న ఆరోపణలే ఇందుకు కారణమని టాక్. ఇప్పటికే ఇదే కారణంతో ‘జననాయగన్’ వాయిదా పడగా.. శనివారం విడుదల కావాల్సిన ‘పరాశక్తి’ పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో సినిమా విడుదలపై సందిగ్ధత నెలకొంది.