CTR: సదుం మండలంలో దెబ్బతిన్న రహదారుల మరమ్మతులకు నిధులు మంజూరైనట్లు ఆర్ అండ్ బీ డీఈ వెంకటప్ప తెలిపారు. సదుం పోలీస్ స్టేషన్ నుంచి హైస్కూల్ వరకు 700 మీటర్లు, సోమల మండలంలోని నంజంపేటలో వంద మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.1.50 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. అలాగే చెరుకువారిపల్లె, నంజంపేట రోడ్ మరమ్మత్తులకు రూ.95 లక్షలతో మంజూరయ్యాయి.