MNCL: నల్గొండలో ఇటీవల జరిగిన జూనియర్ బాలుర రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన జిల్లా క్రీడాకారులు జాడే అచల్ కుమార్, జుమీడే రవివర్మ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరు ఈ నెల 10 నుంచి 15 వరకు ఢిల్లీలోని ప్రీతంపురలో జరుగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని అసోసియేషన్ నాయకులు శ్యాంసుందర్ రావు, రమేష్ తెలిపారు.