PDPL: రామగుండం కార్పొరేషన్లో బోగస్ ఓట్లను తొలగించాలని టీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. రామగుండం కార్పొరేషన్లో తప్పుల తడకతో ఉన్న ఓటర్ల జాబితాను ఆధారాలతో రామగుండం డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మీకి బుధవారం అందజేసినట్లు తెలిపారు. జెన్కో క్వార్టర్ల ఇంటి పేరు మీద 100కు పైగా ఓట్లు కలిగి ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు.