విశాఖ: గాజువాక పట్టణంలో రోజువారీ మార్కెట్లో వ్యాపారుల నుంచి రోజువారీ ఆశీలు వసూలుకు శుక్రవారం సాయంత్రం 3 గంటలకు బహిరంగ వేలంపాట నిర్వహిస్తున్నట్లు జోనల్ కమిషనర్ శేషాద్రి తెలిపారు. అలాగే పెద గంట్యాడ, గాజువాక సుధాహోటల్ వెనుక ఓపెన్ స్టాళ్లలో ఆశీలు వసూలుకు వేలంపాట జరుగుతుందని పేర్కొన్నారు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.