E.G: రాజమండ్రి రూరల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డిప్యూటీ ఎంపీడీవో అమ్మిరాజు తెలిపారు. హుకుంపేట ఎంపీడీవో కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఇంటింటి చెత్త సేకరించేందుకు చెత్త రిక్షాలతో పాటు పారిశుద్ధ్య కార్మికుల కొరత వెంటాడుతుండడంతో ఈ పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కరిస్తున్నట్లు చెప్పారు.