NLG: చిట్యాలలోని పదో వార్డులో వోల్టేజ్ సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముత్యాలమ్మ గుడి దగ్గర ప్రస్తుతం ఉన్న 160 కేవీఏ ట్రాన్స్ఫార్మర్పై అధికలోడ్ వల్ల లో వోల్టేజ్ సమస్యతో వార్డు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, బీజేపీ నాయకుడు చికిలమెట్ల అశోక్ విద్యుత్ అధికారులకు విన్నవించారు. వెంటనే సమస్య పరిష్కారానికి మరో ట్రాన్స్ఫార్మర్ను మంజూరు చేయాలని కోరారు.