MBNR: మిడ్జిల్ మండలం దోనూర్ గ్రామంలో ఈరోజు పాడిపశువుల కోసం ఉచిత పశు వైద్య చికిత్స, గర్భకోశ వ్యాధుల నివారణకు అవగాహన సదస్సు నిర్వహిస్తామని మండల పశువైద్య అధికారి డా. అనుప శివరాజ్ తెలిపారు. ఈ అవకాశాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముందస్తు రోగ నివారణ, నిరోధకతా చర్యలు పాడిపశువుల ఆరోగ్య పరిరక్షణలో సహాయపడతాయని పేర్కొన్నారు.