MLG: గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి మేడారం జాతరలో భక్తులను ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. గ్రామీణ, గిరిజన సంప్రదాయాలు ఉట్టిపడేలా విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల వృత్తులు, వారు తయారుచేసే వస్తువులు, వ్యవసాయ ఆధారిత పరికరాలు, రైతు విగ్రహాలతో ప్రత్యేక శిల్పాలు ఏర్పాటుచేయగా, అవి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.