AKP: అపరాల సాగులో రైతులు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చునని పాయకరావుపేట ఏవో ఆదినారాయణ సూచించారు. మంగళవారం రాజవరం, కేశవరంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. పంటలు సాగు చేస్తున్న రైతులు ఈక్రాప్ నమోదు చేయించుకోవాలన్నారు. ఈ క్రాప్ నమోదు చేయించుకున్న రైతులకే అన్ని రైతు సంక్షేమ పథకాలు వర్తిస్తాయన్నారు.