టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక కాకపోవడంపై ఏబీ డివిలియర్స్ స్పందించాడు. BCCI సెలక్టర్లు ప్లేయర్ల ఫామ్, నాణ్యత కంటే జట్టు కూర్పు పైనే ఎక్కువ దృష్టిపెట్టారని అన్నాడు. సిరాజ్ వన్డే జట్టులో స్థానం సంపాదించుకున్నాడు కానీ దురదృష్టవశాత్తూ టీ20 ప్రపంచకప్ జట్టుకు ఎంపిక కాలేదని చెప్పుకొచ్చాడు.