ADB: నెరడిగొండ మండలం నారాయణ్‌పూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు రూ. 10 లక్షలతో మంజూరు అయిన ప్రహరీ గోడ నిర్మాణానికి మంగళవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. పిల్లల భవిష్యత్ నిర్మాణానికి విద్య అవసరమని, విద్యాభివృద్ధి కొరకు ఎల్లప్పుడూ పాటు పడతానని అన్నారు.