HYD: ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదుట సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముగ్గుల పండుగను నిర్వహించారు. ముగ్గుల పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భారీ సంఖ్యలో విద్యార్థినులు పాల్గొని రంగురంగుల ముగ్గులు, సంక్రాంతి సంప్రదాయాలు, గ్రామీణ జీవన శైలిని ప్రతిబింబించేలా కళాత్మకంగా రూపొందించారు. దీంతో క్యాంపస్లో పండగ వాతావరణం నెలకొంది.