TG: మెదక్ జిల్లా పాపన్నపేట మండలం సీతానగర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో తండ్రిని ఓ కుమారుడు కర్రతో కొట్టి చంపాడు. శ్రీకాంత్ అనే యువకుడు జులాయిగా తిరుగుతూ అప్పులు చేశాడు. అప్పులు తీర్చడానికి తండ్రి డబ్బులు ఇవ్వలేదని తండ్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కర్రతో కొట్టి చంపినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.