TG: గత పాలకుల హయాంలో అశాస్త్రీయంగా జరిగిన మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో సభ్యులు రామ్మోహన్ రెడ్డి, వీరేశం, పాల్వాయి హరీష్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్లో చర్చించి రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపడతామని స్పష్టం చేశారు.