KMM: వచ్చే ఏడాది నుంచి సాంకేతికతను జోడించి, రైతులు సాగు చేసే భూమి, పంటల వివరాల ప్రాతిపదికన కచ్చితమైన పరిమాణంలో ఎరువులు సరఫరా చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. మంగళవారం అసెంబ్లీలో మంత్రి మాట్లాడుతూ.. రైతాంగానికి అవసరమైన మేర ఎరువులు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు.