యాషెస్ చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 518/7 పరుగులు చేసింది. హెడ్ (163) భారీ సెంచరీతో చెలరేగగా, స్మిత్ 129 పరుగులతో అజేయంగా క్రీజులో ఉన్నాడు. దీంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 134 పరుగుల కీలక ఆధిక్యాన్ని సాధించింది. అంతకుముందు ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్లో 384 పరుగులకు ఆలౌటైంది.