TG: ప్రభుత్వ పాఠశాలల పునరుద్ధరణ, మౌలిక సదుపాయాల కల్పనకు ‘మన ఊరు-మన బడి’ పథకం కింద రూ.360 కోట్లతో కాంట్రాక్టర్లు పనులు చేశారని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఆ నిధులను విడుదల చేయాలని సూచించారు. తన సొంత గ్రామంలోనే పాఠశాల పనులు సగంలో ఆగిపోయాయని, చలికాలంలో పిల్లలు ఆరుబయట కూర్చుంటున్నారని కామెంట్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిధులు విడుదల చేయాలన్నారు.