ELR: 2027 గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అయితే కీలకమైన డయాఫ్రమ్ వాల్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణాలకు సమయం పడుతుందని, గడువులోగా పూర్తి చేయడం అసాధ్యమని ఇంజినీరింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా పనులు చేయాల్సి ఉన్నందున అధికారులు ఆచి తూచి అడుగులు వేస్తున్నారు.