మాజీ స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. 2011 ప్రపంచకప్ సమయంలోనే తనకు క్యాన్సర్ ఉన్నట్లు బయటపడిందని చెప్పాడు. ఒకవేళ కీమోథెరపీ చేయించుకోకపోతే.. గుండెపోటు వచ్చి 3 నుంచి 6 నెలల్లోనే చనిపోతానని డాక్టర్లు హెచ్చరించినట్లు వెల్లడించాడు. ఆ తర్వాత తాను క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుని, ఆ మహమ్మారిని ధైర్యంగా అధిగమించినట్లు చెప్పుకొచ్చాడు.