పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈనెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయసభలను ఉద్ధేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 1వ తేదీ, ఆదివారం రోజున కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. అలాగే, ఈ సమావేశాల్లోనే ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ బిల్లును కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది.