VKB: శంషాబాద్లో జరుగుతున్న ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభల్లో పరిగికి చెందిన N. గణేష్ నాయక్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఇవాళ ఎన్నికయ్యారు. ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి, వారికి అన్యాయం జరిగిన ప్రతిచోటా అండగా ఉండి పోరాడుతానని ఆయన స్పష్టం చేశారు.