W.G: MDM పథకం నిమిత్తం 12 లీటర్ల కుక్కర్‌ను RTI మాజీ కమిషనర్ ఐలాపురం రాజా ( విజయవాడ) బహుకరించినట్టు పాలకొల్లు జీవీఎస్వీఆర్ మున్సిపల్ స్కూల్ హెచ్. ఎం. భవానీ ప్రసాద్ మంగళవారం తెలిపారు. పాఠశాల శాశ్వత దాత PNDV.ప్రసాద్ ఈ కానుక అందజేశారని ఆయన తెలిపారు. ఎస్ఎంసీ ఛైర్మన్ కరణం పాపారావు, పీఎంసీ సభ్యులు దాతను అభినందించారు.