WGL: నల్లబెల్లి మండలంలోని రుద్రగూడెం గ్రామపంచాయతీ పరిధిలో యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. లైన్లో ఎక్కువసేపు నిల్చడానికి ఇబ్బంది పడి చెప్పులను వరుస క్రమంలో పెట్టుకున్నారు. ఓ రైతు మద్యం బాటిల్ కూడా లైన్ లో పెట్టడం అక్కడున్న ఇతర రైతులని ఆశ్చర్యానికి గురిచేసింది. అందరికి సరిపడా అందజేయాలని రైతులు కోరుతున్నారు.