PDPL: ధర్మారం మండలం నంది మేడారంలో ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించిన నూతన సర్పంచ్, పలువురు వార్డు సభ్యులను సోమవారం శాలివాహన సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. సర్పంచ్ మేడారం వీర్పాల్, ఉప సర్పంచ్ అరిగే రవికుమార్, వార్డు సభ్యులు వెంకటమ్మ, తిరుపతిలను శాలివాహన యూత్, మహిళలు శాలువాతో సన్మానించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.